షేవింగ్ రేజ‌ర్‌తో త‌మ్ముడి మ‌ర్మాంగాన్ని కోసేశారు!

భువ‌నేశ్వ‌ర్‌: అత్త మీద కోపం దుత్త‌పై చూపించిన‌ట్టు..ఓ వ్య‌క్తిపై ఉన్న కోపాన్ని అత‌ని సోద‌రుడిపై చూపారు కొంద‌రు దుర్మార్గులు. ఆ సోద‌రుడి మ‌ర్మాంగాన్ని కోసేశారు. ఈ కిరాత‌క ఘ‌ట‌న ఒడిశాలోని బార్‌ఘ‌ర్ జిల్లా నీలేశ్వ‌ర్ గ్రామంలో చోటు చేసుకుంది. మ‌ర్మాంగం తెగిపోయి, బాధ‌తో విల‌విల్లాడుతున్న అత‌ణ్ని గుర్తించిన స్థానికులు ఆసుప‌త్రికి త‌రలించారు.

ప్ర‌స్తుతం అత‌ను ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అత‌ని పేరు అశోక్ బారిక్‌. వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. నీలేశ్వ‌ర్ గ్రామంలో అత‌ను నివాసం ఉంటున్నాడు. అశోక్ బారిక్‌కు త‌న అన్న సెబా బారిక్‌, అత‌ని భార్య శాంతి బారిక్‌ల‌తో కొద్దిరోజులుగా గొడ‌వ‌లు ఉన్నాయి. ఆస్తి త‌గాదాలు న‌డుస్తున్నాయి.

గ‌తంలో ఇద్ద‌రూ ఒక‌ట్రెండు సార్లు ఘ‌ర్ష‌ణ కూడా ప‌డ్డార‌ట‌. ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం అదే గ్రామానికి చెందిన సుధామ్ సాహు అనే వ్య‌క్తి అశోక్ బారిక్ ఇంటిపై దాడి చేశాడు. షేవింగ్ చేసుకునే రేజ‌ర్‌తో అత‌ని మ‌ర్మాంగాన్ని కోసేశాడు.

ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న అత‌ణ్ని స్థానికులు గుర్తించి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అన్నా వ‌దిన త‌న హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌ని, కుట్ర‌లో భాగంగా వారు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని అశోక్ బారిక్ ఆరోపిస్తున్నారు. అత‌ని ఫిర్యాదు మేర‌కు స‌ద‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. సుధామ్ సాహును అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here