చంద్రబాబుకు ట్విట్టర్ లో సవాల్ విసిరిన జగన్.. మా వాళ్ళు రాజీనామా చేశారు.. మీవాళ్ళు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రస్తుతం ప్రతి ఒక్క పార్టీ పోరాటం చేస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. మరో వైపు వైసీపీ ఎంపీలు రాజీనామాలు కూడా చేసేశారు. దీనిపై చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీకి హోదాను డిమాండ్ చేస్తూ, వైసీపీ సభ్యులు కొద్దిసేపటి క్రితం తమ రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని ఆమె సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ముందుగా చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాలను నేడు స్పీకర్ కు సమర్పించారని జగన్ తెలిపారు. ఇక తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా హక్కని, ప్రజల పక్షాన నిలబడాలని టీడీపీకి పిలుపునిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here