`క‌డ‌ప దాటి ప్ర‌తీ గ‌డ‌ప‌లోకి వ‌స్తున్నాను..మీతో క‌లిసి న‌డ‌వాలనుంది..`

తిరువ‌నంత‌పురం: దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది. ఆ మూవీ పేరు `యాత్ర‌`. మ‌హి వీ రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై విజయ్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌ను మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి పోషిస్తున్నారు.

వైఎస్ ట్రేడ్‌మార్క్ చిరున‌వ్వుతో, పంచెక‌ట్టుతో.. అచ్చు గుద్దిన‌ట్టు క‌నిపిస్తున్నారు మ‌మ్ముట్టి. పాద‌ముద్ర‌పై `యాత్ర‌` అంటూ డిజైన్ చేసిన టైటిల్.. సినిమా డెప్త్ ఏమిటో తెలియ‌జేస్తోంది. `క‌డ‌ప దాటి ప్ర‌తీ గ‌డ‌ప‌లోకి వ‌స్తున్నాను.. మీతో క‌లిసి న‌డ‌వాల‌నుంది..మీ గుండె చ‌ప్పుడు వినాల‌నుంది..` అనే క్యాప్ష‌న్.. వైఎస్ పాద‌యాత్ర‌ను గుర్తుకు తెచ్చింది. మ‌మ్ముట్టి మిన‌హా మ‌రెవ‌రూ స‌రిపోర‌నేలా ఉందీ ఫ‌స్ట్‌లుక్‌.

Yatra First Look

Mammoottyさんの投稿 2018年4月7日(土)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here