అనంత‌లో వైఎస్ఆర్ సీపీ కార్య‌క‌ర్త దారుణ‌హ‌త్య‌

అనంత‌పురం: ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త ఒక‌రు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. జిల్లాలోని కందుకూరు గ్రామ శివార్ల‌లో శుక్ర‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌తుడి పేరు శివారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌. రాప్తాడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి అనుచ‌రుడు. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్తలు అత‌ణ్ని హ‌త‌మార్చార‌ని అంటున్నారు.

 

కందుకూరుకు చెందిన శివారెడ్డి బైక్‌పై వెళ్తుండ‌గా.. ప్ర‌త్య‌ర్థులు కాపుగాసి, వేటకొడవళ్లతో నరికిచంపారు. జిల్లా మంత్రి పరిటాల సునీత ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. త‌నకు ప్రాణ‌హాని ఉంద‌ని శివారెడ్డి ప‌లుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ.. వారు ప‌ట్టించుకోలేద‌ని, ఇది ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here