పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చిన చాహల్..!

గత కొద్ది రోజులుగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్ పెళ్ళి గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చాహల్ కన్నడ నటిని పెళ్ళి చేసుకోబోతున్నాడని.. ఈ ఐపీఎల్ అయిపోయాక పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. దీనికి చాహల్ స్పందించాడు. అలాంటిది ఏమీ లేదని తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

ప్రతి ఒక్కరికీ తాను ఓ విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నానని.. తన జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదని చెప్పుకొచ్చాడు. తాను పెళ్ళి చేసుకోవడం లేదని పక్కా క్లారిటీ ఇచ్చాడు. తనిష్కా, తాను మంచి స్నేహితులు మాత్రమేనని చెప్పుకొచ్చాడు చాహల్. తన ఫాన్స్ కూ.. మీడియాకు చెప్పుకొచ్చేదేమిటంటే తన పెళ్ళికి సంబంధించిన రూమర్లను ఇకనైనా ఆపండి. వైరల్ చేయడం వలన ఎవరికీ లాభం లేదు. అలాగే తన వ్యక్తిగత జీవితాన్ని కూడా గౌరవించాలని విన్నవించుకున్నాడు. దయచేసి తన పెళ్ళి గురించి ఎటువంటి వార్తలను ప్రచురించకండి అని చెప్పాడు. ఆ వార్తలన్నీ నిరాధారమని చెప్పాడు. ఏదైనా తన గురించి రాసే బదులు దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలని చెప్పుకొచ్చాడు చాహల్. అంటే ఇప్పట్లో పెళ్ళి లేదని చాహల్ చెప్పేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here