ఖురాన్ నేర్చుకోడానికి వెళ్ళిన ఏడేళ్ళ పాపను రేప్ చేసి చంపేశారు.. అందుకే న్యూస్ రీడర్ నిరసన..!

ఖురాన్ నేర్చుకోడానికి వెళ్ళిన ఏడేళ్ళ పాపను చంపేసి రోడ్డు పక్కన పడేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు తీవ్ర నిరసన చేపట్టారు. అదే ఘటనకు నిరసనగా ఓ న్యూస్ యాంకర్ తన కూతురిని ఒళ్లో కూర్చోపెట్టుకుని వార్తలు చదివింది. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.

తూర్పు పాకిస్థాన్‌లోని కసూర్ ప్రాంతంలో గత వారం జైనబ్ అన్సారీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైంది. ఖురాన్ నేర్చుకోవడానికి వెళ్తుండగా ఆ చిన్నారిని ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చెత్తను పడేసే ప్రాంతంలో శవం దొరికింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతను తీసుకొని వచ్చింది. పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ అల్లర్లలో ఇద్దరు మరణించారు కూడా..! అయితే ఆ అమ్మాయి మృతికి గల కారణాలు ఇప్పటి వరకూ ఎవరికీ తెలీలేదు.

పాకిస్థాన్ లో రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగిపోవడం.. జైనబ్ అన్సారీ మృతికి నిరసనగా ‘సమా టీవీ’ యాంకర్ కిరణ్ నాజ్ తన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకొని వార్తలు చెప్పడం మొదలుపెట్టింది. చిన్న చిన్న పిల్లల మానాలు కూడా కాపాడుకోలేకపోతున్న సమాజంలో మనమున్నామని చెప్పింది. “ఈ రోజు నేను మీ యాంకర్ కిరణ్ నాజ్ ను కాను.. నేను ఒక తల్లిని.. నా కూతురితో కలసి ఇక్కడకు వచ్చాను” అని చెప్పింది. చిన్నారి మృతదేహం కసూర్ వీధుల్లో పడి ఉంది. పాపను దారుణంగా పొట్టనబెట్టుకోవడంతో పాకిస్థాన్ యావత్తూ బాధతో కుమిలిపోతోంది. ఈ రోజు మానవత్వానికి అంత్యక్రియలు జరుగుతున్నాయంటూ కిరణ్ నాజ్ వార్తలు చదివింది. ఒక వైపు వారి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటే.. మరో వైపు ఆ బాలిక అత్యాచారం జరిందంటూ కిరణ్ భావోద్వేగంతో ఈ వార్తను చదివింది. కిరణ్ నాజ్ పాకిస్థాన్ లోని టాప్ న్యూస్ రీడర్లలో ఒకరు.. ఆమె చేసిన ఈ పనిని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here